YS Jagan Mohan Reddy

Description
President, YSR Congress Party
We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 2 months, 2 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.


https://telegram.me/govtupadates_AP

Last updated 2 months, 1 week ago

President, YSR Congress Party

Last updated 1 month, 1 week ago

1 month, 1 week ago

జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు ఆయన. గాంధీగారి సిద్ధంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయం.

#SatyamevaJayate

1 month, 1 week ago

Congratulations to ISRO on its 100th launch from Sriharikota! Wishing continued success in serving the nation and achieving many more such milestones.
Kudos to Team ISRO!

#100thLaunch

3 months, 3 weeks ago

ఎన్టీఆర్ గారిని మించిన నటనతో.. సూపర్-6 హామీల్ని పక్కా ప్లాన్‌తో చంద్రబాబు అటకెక్కిస్తున్నాడు

3 months, 3 weeks ago

బాల్యం.. మ‌ళ్లీ ఎప్ప‌టికీ తిరిగిరాని, మ‌రిచిపోలేని మధుర జ్ఞాప‌కం. బాల్యంలో ఉన్న మ‌న పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దాం. వాళ్లే రేప‌టి భావి భార‌త ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

3 months, 3 weeks ago

చంద్రబాబు గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?

ఆడ‌బిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన‌ ప్ర‌తి మ‌హిళకు నెల‌కు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్‌?

దీపం:
ప్ర‌తి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండ‌ర్లు. 1,54,47,061 క‌నెక్ష‌న్ల‌కు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్‌?

త‌ల్లికి వంద‌నం:
ఎంత‌మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్‌?

అన్న‌దాత‌:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 ల‌క్ష‌ల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్‌?

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం:
రాష్ట్రంలో మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు ప్ర‌యాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అతీగ‌తీలేదు.

యువ‌గ‌ళం:
రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి, నిరుద్యోగుల‌కు రూ.3వేలు ఇస్తా అన్నావ్‌. ఒక్కొక్క‌రికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్‌

50 ఏళ్లు పైబ‌డిన వారికి రూ.4వేలు పింఛ‌న్‌:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబ‌డిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఒక్కొక్క‌రికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.

నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?

ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.

#WeStandForTruth
#WeAreWithYSRCPSM

7 months ago

చంద్రబాబు … 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్‌-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్‌ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుంది. ఇదిజరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇదే మాదిరిగా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి వారికి అండగానిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

అయితే 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆతర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్‌, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను.

అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడులకోసం బ్యాంకులచుట్టూ, వడ్డీవ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులను తీసుకొచ్చారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులసహా, ఇన్సూరెన్స్‌ ప్రీమియంకట్టి ఆ 2023-24కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్మును తక్షణమే విడుదలచేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.

రైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ…

7 months ago

చంద్రబాబు… ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చిమోసం కాదా?

చంద్రబాబూ… ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే మీరు ప్లేటు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీచేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పులకు వడ్డీలుకట్టాలి, అవి కట్టడానికే డబ్బుల్లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారు.

తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇవ్వలేదు, రైతు భరోసాకింద ప్రతి రైతుకు రావాల్సిన రూ.20వేలు రాలేదు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద రెండు త్రైమాసికాల డబ్బులు పెండింగ్‌, వసతి దీవెనా లేదు, సున్నావడ్డీ లేనే లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకూడా నెల రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు జాడే లేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా రూ. 3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. చివరకు రూ.20వేలు ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదు. పేదలకు అత్యవసరమైన ఆరోగ్యశ్రీ చెల్లింపులు రూ.1600 కోట్లు పెండింగ్‌. ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చే విధానం ఆగిపోయింది. ఇంటికి వచ్చే రేషన్‌ నిలిచిపోయింది. వాలంటీర్లను మోసం చేశారు, విత్తనాలకోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని తీసుకు వచ్చారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారు. బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ రద్దుచేశారు. విద్యా కానుక కిట్లు పంపిణీ అరకొరగానే, అదికూడా అస్తవ్యస్తం. మధ్యాహ్న భోజనం పథకంలో రోజుకో మెనూ పద్ధతిపోయింది. ఇంగ్లిషుమీడియం గాడితప్పింది, బడుల్లో, గ్రామాల్లో పరిశుభ్రత పడకేసింది. లా అండర్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పింది. రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోంది. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశయాప్‌ అటకెక్కింది. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ?

ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లమేర రాష్ట్రం అప్పులపాలైందని, శ్రీలంక అయిపోయిందని, ఆర్ధిక విధ్వంసం జరిగిందని మీరు ఊరూరా విష ప్రచారం చేశారు. అయినా సరే అపార అనుభవం ఉంది, నన్ను మించినవారు లేరు, అమలు చేసే బాధ్యత నాదీ అని, సూపర్‌ సిక్స్‌ అంటూ సూపర్‌ టెన్‌ అంటూ చాలా చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటున్నారు. అదికూడా అసత్యమే అయినా సాక్షాత్తూ గవర్నర్‌గారితో అసెంబ్లీలో ఇలాంటి అనేక అవాస్తవాలను చెప్పించారు.

నిజాలు ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, విద్యుత్‌ కంపెనీల రుణాలతో కలిపి, గ్యారంటీ రుణాలు, నాన్‌ గ్యారంటీ రుణాలు ఇవన్నీ జూన్‌ 2024నాటికి ఉన్న మొత్తం అప్పులు అక్షరాల రూ.7,48,612కోట్లు. ఇందులో 2019లో మీరు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు. దీనికిపైన ఉన్నవి మాత్రమే మా హయంలో చేసిన అప్పులు. మీ హయాంలో అప్పుల వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 21.63శాతం అయితే, కోవిడ్‌ కారణంగా ఆర్థికవ్యవస్థలో మహా సంక్షోభం వచ్చినా, మా హయాంలో అది కేవలం 12.9 శాతం. ఈ వాస్తవాలన్నింటినీకూడా గవర్నర్‌గారికి లేఖ రూపంలో తెలియజేశాం. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆర్బీఐ నివేదికలు, కాగ్‌ లెక్కల్లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు ఈ లింక్‌ bit.ly/4dkOKru లో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.

ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేసి, అబద్దపు లెక్కలతో ప్రజలను మోసంచేయడం మాని, సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలను తు.చ. తప్పక అమలు చేయండి. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టండి.

We recommend to visit

Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Last updated 2 months, 2 weeks ago

గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.


https://telegram.me/govtupadates_AP

Last updated 2 months, 1 week ago

President, YSR Congress Party

Last updated 1 month, 1 week ago