గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://telegram.me/govtupadates_AP
Last updated 10 months ago
Last updated 9 months, 2 weeks ago
నాగినేని✍️✍️
*?పదోతరగతితో పనికొచ్చే కోర్సు, శ్రీ వెంకటేశ్వర వెటర్న రీ యూనివర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు*
దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 990 సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 330 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 660 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు జులై 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిచేస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.880 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.440 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సు వివరాలు..
కోర్సు వ్యవధి: రెండేళ్లు .
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్ .*
సీట్ల సంఖ్య:990 (ప్రభుత్వ పాలిటెక్నిక్లు-330, ప్రైవేట్ పాలిటెక్నిక్లు-660)
ఎస్వీవీయూ పరిధిలోని కళాశాలలు..
కళాశాల ప్రాంతం/జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ గరివిడి, విజయనగరం జిల్లా
శ్రీ నీలకంఠాపురం కావేరప్ప ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
ఎస్కేపీపీ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ రంపచోడవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పలమనేరు, చిత్తూరు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ రాపూర్, నెల్లూరు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ బనవాసి, కర్నూలు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కొమ్మెమర్రి, నంద్యాల జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ సోదం, చిత్తూరు జిల్లా
ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ వెన్నలవలస, శ్రీకాకుళం జిల్లా.
ఎస్వీవీయూ అనుబంధ కళాశాలలు..
కళాశాల ప్రాంతం/జిల్లా
మలినేని లక్ష్మయ్య ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కనుమల్ల గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా
ఎస్ఎస్ & ఎన్ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ నర్సారావుపేట, పల్నాడు జిల్లా
డాక్టర్ అంజలి ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ నాగాయలంక, క్రిష్ణా జిల్లా
శ్రీ వేంకటేశ్వర ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా
చైతన్య భారతీ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పల్లవోలు, ప్రొద్దుటూరు, కడప జిల్లా
గోకుల్ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పిరిడి, బొబ్బలి మండలం, విజయనగరం.
ఆదరణ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ హంపాపురం, అనంతపురం జిల్లా
పైడయ్య ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ పటవల, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
భూమా శోభ నాగిరెడ్డి మెమోరియల్ ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా
అర్చన ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ రాయచోటి, అన్నమయ్య జిల్లా
శ్రీ వేంకటేశ్వర ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ తక్కోలు, కడపజిల్లా
శ్రీ వేంకటేశ్వర ఏనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ తక్కోలు, కడపజిల్లా
అర్హత:పదోతరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: 31.08.2024 నాటికి 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పదోతరగతిలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు:జనరల్, బీసీ అభ్యర్థులు రూ.880; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.440 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08.07.2024.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.07.2024.
గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన Telegram చానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
https://telegram.me/govtupadates_AP
Last updated 10 months ago
Last updated 9 months, 2 weeks ago