ఆహారమే ఆరోగ్యము

Description
ఆయుర్వేద ఆరోగ్యం
Advertising
3 months, 3 weeks ago

వెల్లుల్లి

వెల్లుల్లి మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మంచి చేస్తుంది. మరి అటువంటి వెల్లుల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అసిడిటీ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారు రోజూ ఉదయాన్నే వెల్లుల్లిని తింటే ప్రయోజనం ఉంటుంది. ఊరికే తినడం కష్టమనుకుంటే వెల్లుల్లిని తేనెలో కలిపి తీసుకోవచ్చు. వెల్లుల్లిని తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. దీని వల్ల శరీరం లోపలి భాగాలు కూడా శుభ్రమవుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వెల్లుల్లిని మించిన ఔషధం లేదనే చెప్పొచ్చు. జీర్ణాశయంలోని ఎంజైమ్స్‌ని ఉత్తేజపరిచి, అనవసరమైన ఫ్యాట్‌ని బయటికి పంపిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతాం.
క్యాలరీలు కరుగుతాయి. వెల్లుల్లిని అడ్రినలైన్‌ని విడుదల చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై జీవక్రియ బాగా జరుగుతుంది.యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన వెల్లులిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అందువల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. బ్రోంకైటిస్ నివారణకు వెల్లుల్లి బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో ఎలిసిన్, సెలినియం, యాంటి ఆక్సిడెంట్లు, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్ వంటి ఎన్నో ప్రత్యేక గుణాలు కాలేయాన్ని కాపాడతాయి. కొంతమంది ఒంటినొప్పుల సమస్యను ఎదుర్కొంటారు. అలాంటివారు.. వెల్లుల్లిని తినడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

అదే విధంగా, యాంటీ క్లాటింగ్ ప్రాపర్టీస్ గుణాలు కలిగిన వెల్లుల్లిని తినడం వల్ల రక్తం గడ్డం కట్టదు. దీంతో గుండె సమస్యలకి దూరంగా ఉండొచ్చు. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మ సమస్యలు వేధించవు. ఈ రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం మెరవడమే కాకుండా మొటిమలు, మచ్చల సమస్యలు. అంతేకాకుండా, చర్మం మెరుపుని సంతరించుకుంటుంది

3 months, 3 weeks ago

వెల్లుల్లితో వైద్యం  -

దీని రసం కారంగా ఉండును. వేడి చేయును . దీనిని లొపలికి తీసుకున్న మిక్కిలి వేడి చేయును .

ఉపయోగాలు  -

*  శరీరములో కఫముని పొగొట్టును.

*  శ్లేష్మంని పొగొట్టును.

*  వాతము , బాలింతలకు వచ్చే సూతికా రోగము , టైఫాయిడ్ జ్వరం పొగొట్టును.

*  దేహము అంతా చల్లబడే మహావాతం ను పొగొట్టును.

*  పాతకాలం నుంచి ఉండు జ్వరం పొగొట్టును.

*  వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం ని నిర్మూలించును.

*  ఊపిరి తీసుకుంటున్నప్పుడు వచ్చే ఊపిరిగొట్టు నొప్పి పొగొట్టును.

*  అజీర్ణం , అజీర్ణం వలన వచ్చే కడుపునొప్పి పొగొట్టును.

*  శరీరం యొక్క ఉబ్బుని నిర్మూలించును.

*  కడుపులో ఏర్పడే బల్లలు నివారించును.

*  గుల్మము , మూలవ్యాధి , కుష్టు , క్షయ ని నివారించును.

*  నోటికి రుచి లేకపోవటం , హుద్రోగము , ఆస్తమా , తలనరములకు సంబంధించిన రోగములు నివారించబడును.

  • బ్రాంకైటిస్ , ఒంటినొప్పులు నివారించబడును.

*  దేహము పచ్చబరుచునట్టి జ్వరముని నివారించబడును.

*  విరిగిన ఎముకలను అతుక్కోనున్నట్టు చేయును .

*  మూత్రము , చెమటని శుభ్రపరచును.

*  కంఠస్వరం ని బాగుగా చేయును .

*  చేతులు , కాళ్లు వణికే రోగమును పొగొట్టును .

*  మూత్రపు సంచిలో పుట్టెడు రాయిని కరిగించును.

*  స్త్రీలకు పాలు ఉత్పత్తి అయ్యేలా చేయును .

*  అంజూరా , అక్రోటుతో తినిన విషము విరుచును.

  • వెల్లుల్లిపాయల రసముని , వెల్లుల్లి పాయలు వేసి కాచిన నూనె గాని చెవిలో పోసిన చెవుడు , చెవినొప్పి మాయం అగును.

*  వెల్లుల్లిపాయలలో పసుపువేసి నూరి పక్షవాతం వచ్చిన అంగములకు పట్టించిన పక్షవాతం నివారణ అగును.

*  వెల్లుల్లిపాయలు నూరి కట్టిన గోరుచుట్టు , కణుపు మీద పుట్టిన గడ్డ , గడ్డలు నివారణ అగును.

*  ఒకే రెక్క కలిగిన వెల్లుల్లిపాయ ని రెండుముక్కలుగా కోసి ఒక ముక్కని పాము కరిచిన చోట అంటించిన విషము హరించును . విషము పీల్చడంలో దీనిని మించినది లేదు .

*  పచ్చి వెల్లుల్లిపాయని ప్రతిరోజు తినుచుండిన అతిమూత్ర వ్యాధి కట్టును . మోతాదు పూటకు 1 రెబ్బ నుంచి 8 రెబ్బలు వరకు పెంచుకుంటూ వెళ్లవలెను . ఇలా రెండు పూటలా తినవలెను .

*  ఆవనూనెలో వెల్లుల్లిపాయలు వేసి కాచి వడగట్టి ఆ నూనె పూసిన గజ్జి , చిడుము మానును .

దీనిని అతిగా వాడటం వలన కలుగు నష్టాలు -

*  శరీరం నందు మిక్కిలి వేడి చేయను.

*  రక్తము నందు పైత్యంని హరించును .

*  తలనొప్పిని కలుగజేయును .

*  కండ్లకు హానిచేయును .

*  స్ప్లీన్ , ప్రేవులకు హానిచేయను .

*  గర్భిణీ స్త్రీలు వాడరాదు.

*  రక్తవిరేచనాలు కలిగించును.

*  రక్తపోటు పెంచును.

*  వేడి శరీరం గలవారు అతితక్కువ మోతాదులో వాడవలెను .

*  దాహము కలిగించును.

దీనికి విరుగుళ్లు  నెయ్యి , దానిమ్మ రసం , పులుసు , పాలు , బాదము నూనె.

వెల్లుల్లి రెబ్బలని అన్నం ఇగురుతున్నప్పుడు
దానిలో గుచ్చి అన్నంతోపాటు తినవలెను . కారం లేకుండా ఉడికి ఉంటాయి.
      వెనిగర్ లో నానబెట్టి కొన్ని దినముల తరువాత ఉపయొగించవలెను . 
    . రక్తనాళాలోని కొవ్వుని కూడా నివారిస్తుంది.

3 months, 3 weeks ago

*⛑️సర్వరోగ నివారిణి. మహా ఓషది శొంఠి⛑️*

👉అల్లం పై పొట్టు ని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది.

👉శొంఠిని సంస్కృతంలో మహా ఓషది, విశ్వభేషజాం అని కూడా అంటారు.

👉 ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి.

👉దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు.

👉ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది.

👉దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది.

👉మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది.

👉కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది.

👉మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది.

👉పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది.

👉శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది.

👉ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది.

👉దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి.

👉ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది.

👉జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదు గా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది.

👉అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది.

👉కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాడుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది.

👉 ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి.

👉రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును.

👉పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడు పూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది.

👉మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైన్ధవ లవణం కలిపి తీసుకుని పల్లెరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది.

👉నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి.

👉ఇంకా ఎన్నో సమస్యలకు ఈ మహా ఓషది పనిచేస్తుంది..

☸️☸️☸️☸️☸️☸️

5 months, 3 weeks ago

*Black Cumin :
. జీల‌క‌ర్ర‌లో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే జీల‌క‌ర్ర కాకుండా న‌ల్ల జీల‌క‌ర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి మ‌నం అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

న‌ల్ల జీల‌క‌ర్ర‌ను చేదు జీల‌క‌ర్ర అని కూడా అంటారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి ఒక మ‌ర‌ణాన్ని త‌ప్ప మిగిలిన అన్ని ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చని ఆయుర్వేద గ్రంథాల‌లో ఋషులు పేర్కొన్నారు. న‌ల్ల జీల‌క‌ర్ర‌లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. న‌ల్ల జీల క‌ర్ర‌లో ఉండే ర‌సాయ‌నిక ప‌దార్థాలు శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నకు వ‌చ్చే క‌డుపు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, మూత్ర‌పిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర ఔష‌ధంగా ప‌ని చేస్తుంది.

శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వును క‌రిగించంలో, బీపీని నియంత్రించ‌డంలో, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఈ న‌ల్ల జీల‌క‌ర్ర దోహ‌ద‌ప‌డుతుంది. శ‌రీరంలో త‌గినంత ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో న‌ల్ల జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. న‌ల్ల జీల‌క‌ర్ర యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో అలాగే ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఈ జీల‌క‌ర్ర మ‌నకు తోడ్ప‌డుతుంది.

కాస్త చేదుగా ఉండే నల్ల జీలకర్రతో ఒబేసిటీని దూరం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు మూడు నెలల పాటు నల్ల జీలకర్ర వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీనిద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. నల్ల జీలకర్ర మూత్ర విసర్జనను క్లియర్ చేస్తుంది. శరీరంలోని అధిక కొవ్వును మూత్రం ద్వారా బైటికి పోయేల చేస్తుంది. అందుకే నల్ల జీలకర్ర రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మీరు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.
న‌ల్ల జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ న‌ల్ల జీల‌క‌ర్ర‌ర‌ను వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ క‌షాయాన్ని గోరు వెచ్చ‌గా ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మం రోగాల బారిన ప‌డ‌కుండా ఉంటాం. న‌ల్ల జీల‌క‌ర్ర నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి నల్ల జీలకర్ర సహాయపడుతుంది. అలసట, బలహీనతను తొలగించడంలో తోడ్పడుతుంది. పొట్టలో వచ్చే అనేక సమస్యలను తొలగించడంలో నల్ల జీలకర్ర లోని యాంటీ మైక్రోబల్ లక్షణాలు తోడ్పడతాయి. సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్, అపానవాయువు, కడుపు నొప్పి, విరేచనాలు, కడుపు పురుగులు వంటి వాటికి ఎంతో ఉపశమనం ఇస్తుంది
నల్ల జీలకర్ర వల్ల ఈ లాభాలే కాకుండా శృంగార రసాన్ని కూడా ఎక్కువగా ఆస్వాదించొచ్చట. అంగస్తంభన సమస్యలు ఉన్నవారికి, వీర్యకణాలు తక్కువగా ఉన్నవారికి ఈ నల్ల జీలకర్ర అద్భుత ఔషధంగా పనిచేస్తుందట.
ఒక వయసు వచ్చిన తరువాత తమలోని సెక్స్ కోరికలు తగ్గాయని చాలామంది వాపోతుంటారు. అలాంటివారి కోసం ఈ నల్ల జీలకర్ర చాలా బాగా పనిచేస్తుందట. మీలోని శక్తిని పెంచి తృప్తిని అందించడమే కాకుండా కోరికలు గుర్రాలైతే అన్నట్టుగా పరుగులు తీస్తారు
ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌నం ఇన్ ఫెక్షన్ ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించడం వ‌ల్ల మ‌నం శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి త‌ద్వారా ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

5 months, 3 weeks ago

_# ALOPECIA / పేనుకొరుకుడు:_*

గుండ్రముగా  వెంట్రుకలు పూర్తిగా పోయి నున్న పడటాన్ని పేనుకొరుకుడు అంటారు.. అయితే చాలా మంది పేను వచ్చి కొరకడం వలన వచ్చింది అని అనుకుంటారు.. అయితే ఇది నానుడి మాత్రమే.. ఇది ఒక రకమైన ఎలర్జీ అని డాక్టర్స్ చెబుతున్నారు.._

*_ALOPECIA / పేనుకొరుకుడు

_1అతిమధురం 100 గ్రాములు_

_2 సుగంధపాల 100 గ్రాములు_

_3 ఉసిరికాయ చూర్ణం 100 గ్రాములు_

_4 శతావరి చూర్ణం 100 గ్రాములు_

_5 అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు_

_6 పటిక బెల్లం 500 గ్రాములు._

_పైన చెప్పబడిన పదార్థాలన్నింటినీ సేకరించి అన్నింటిని కలుపుకోవాలి._

_ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి._

_ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, గేద పాలు లో కలిపి తాగాలి._

_# మందులు తీసుకుంటూ కింద చెప్పబోయే లేపనం కూడా రాసుకోవాలి "..!_

_పేనుకొరుకుడు ఉన్నచోట ఈ కింద చెప్పబడిన లేపనం రాయండి.._

_1ఉమ్మెత్త ఆకు రసం 100 గ్రాములు_

_2 గుంటగలగర ఆకు రసం 100 గ్రాములు_

_3 పిచ్చికుసుమ ఆకు రసం 100 గ్రాములు_

_4 దొండ ఆకు రసం 100 గ్రాములు_

_5 మందార పువ్వుల రసం 100 గ్రాములు_

_6 మిరియాలు 10 గ్రాములు_

_7 పిప్పళ్ళు 10 గ్రాములు_

_8 పచ్చ కర్పూరం 10 గ్రాములు_

_9 వేప నూనె 300 మిల్లీలీటర్లు._

_వేప నూనెలో పైన చెప్పబడిన అన్ని పదార్థాలను వేసి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. దీనిని ఒక సీసా లోకి వడపోసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను పేనుకొరుకుడు ఉన్నచోట రాయాలి._

_ఇలా వరుసగా 90 రోజులు చేస్తే పేనుకొరుకుడు పోయి కొత్త వెంట్రుకలు మరలా వస్తాయి._

6 months, 3 weeks ago

Kanjarla.HanmanthraoPanthulu
cell.9949363498:

అన్నిరకాల నొప్పులకు
**##**

? కషాయాలు
1 వ వారం...పారిజాతం
2 వ వారం....మారేడు
3 వ వారం... గరిక
4 వ వారం....జామాకు

తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)
నూనెలు
1వ వారం.. నువ్వుల నూనె 2 స్పూన్లు
2వ వారం...కొబ్బరి నూనె. 3స్పూన్స్
రిపీట్
సిరిధాన్యాలు

  1. అండు కొర్రలు 3రోజులు
  2. కొర్రలు 1రోజు
  3. ఊదలు 1రోజు
  4. సామలు 1రోజు
  5. అరికలు 1రోజు

? నీరు - రాగి బిందెలో వి కాని రాగి రేకువేసిన కుండలో కాని శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి
(6 గంటలు నీరు ఉండాలి )
? పాల కోసం - నువ్వుల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.

?నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.

? తీపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)

? నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజల నూనెలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)

? కాఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా,కార్న్ ఫ్లోర్, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.

? సిరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.

? మట్టి లేక స్టీలు పాత్రలలో వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.

? ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.

?10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.

ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి..

Call 9949363498

8 months ago

Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
#####################₹
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

????????????
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము
Call 9949363498

8 months, 1 week ago

అన్ని లివర్ సమస్యలకు
?????????
నేల ఉసిరి చూర్నం  100గ్రా
నేలవేము చూర్నం   100గ్రా
తెల్లగలిజేరు చూర్నం 100గ్రా
కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా
మండూర భస్మం         10గ్రా
గుంటగలగర చూర్నం  100గ్రా

ఈ అన్ని కలిపి గాజు పాత్రలో నిలువ చేసుకోవాలి
రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి అరగంట ముందు గోరువచ్చని నీటితో తీసుకొవాలి, సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి
పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు

పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

8 months, 3 weeks ago

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ?

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*

ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Hanmonthrao panthulu
9949363498

10 months ago

?  కేశవర్ధిని ?

వెం**ట్రుకలు ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.

ఈ తైలం చేయు విధానం : 

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7,కరక్కాయల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg

ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
        కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,

శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.
         మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Arogya samasyalaku
call cell.9949363498
K.Hanmanthrao panthulu
: