FactCheck.AP.Gov.in

Description
Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh
We recommend to visit

వేమన శతకంలోని వంద పద్యాలను..
అద్భుతమైన వివరణతో విని ఆనందించండి.
నేటి బాలలకే కాదు పెద్దలకూ ఉపయోగకరం!
-Naren

Last updated hace 2 años, 5 meses

10 months, 3 weeks ago

‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించినందుకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయటం జరుగుతుంది.
– రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెడ్‌ డీఎఫ్‌సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎలాంటి రుణమూ పొందలేదు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ విషయమై ఏపీ సీఆర్డీఏకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు. కనార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల కోసం వినియోగించడం జరిగింది.
– రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌ జీవోఎంఎస్‌ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం రూ.2,060 కోట్ల రుణాన్ని కన్టార్టియం బ్యాంకులైన యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంకు మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీఏకు రిలీజ్‌ చేయటం జరిగింది.
– 2017లో హడ్కో రూ.1275 కోట్ల రుణాన్ని మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేసింది. అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్‌ లెటర్‌ జారీ చేయటం జరిగింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణమూ పొందలేదు. ఈ వార్త పూర్తిగా అవాస్తవం.

11 months ago

దీనితో పాటుగా తయారుచేసే రిజిస్టర్‌ ఆఫ్‌ డిస్‌ప్యూట్స్, రిజిస్టర్‌ ఆఫ్‌ చార్జెస్‌ అండ్‌ కోవినంట్స్‌ వల్ల భూములపై ఉన్న అన్ని రకాల చార్జీలు, వివాదాలు ఒక దగ్గరికి వస్తాయి. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఏవైనా వాటిని నిర్దేశించిన పద్ధతిలోనే రిజిస్టర్‌ ఆఫ్‌ టైటిల్స్‌లో నమోదు చేస్తారు. దీంతోపాటు తయారుచేసే మిగతా రెండు రిజిస్టర్ల వల్ల సదరు భూమిపై ఉన్న అన్ని చార్జీలు, రుణాలు, ఒకే దగ్గర తెలియడం వల్ల ఆ భూమికి సంబంధించి సింగిల్‌ సోర్స్‌ ఆఫ్‌ ట్రూత్‌గా ఈ రిజిస్టర్‌ ఆఫ్‌ టైటిల్స్‌ను పరిగణించవచ్చు. ఈ రికార్డులు ఎవరో ఒక అధికారి చేతిలో ఉండవు. ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్‌ ఉన్న ప్రతివారూ చూడొచ్చు. భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా ఎవరైనా ఎప్పుడైనా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

11 months ago

వాస్తవం: కంక్లూజివ్‌ టైటిల్స్‌ రాత్రికే రాత్రే ఇవ్వరు. రీసర్వే ప్రక్రియ పూర్తయ్యాకే ఈ టైటిల్స్‌ ఇస్తారు. దీనికి రెండేళ్లపైనే పడుతుంది. వివాదాలు లేని భూములనే టైటిల్‌ ఆఫ్‌ రిజిస్టర్‌లో నమోదుచేస్తారు. దీని తర్వాత కూడా కంక్లూజివ్‌ టైటిల్స్‌ సమయంలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు? దేన్ని వివాదంగా చూడాలి? అన్న విషయాలను అథారిటీ తన రూల్స్‌లో స్పష్టంగా పేర్కొంటుంది. ఈ రూల్స్‌ ప్రస్తుతం తయారవుతున్నాయి.

ఆరోపణ: రికార్డుల్లో ఒకసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రెండేళ్ల తర్వాత ఆ పేరు గల వ్యక్తి యజమాని అవుతాడు.రిజిస్టర్‌లో పేర్లను చేర్చే క్రమంలో కొందరు అధికారులు, రాజకీయ నేతలు చెప్పినట్లుగా తయారు చేసే అవకాశం ఉంది. రిజిస్టర్లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోలేరు. పైగా టైటిల్‌ రిజిస్టర్‌ను ఆన్‌లైన్‌లో ఉంచుతామని చట్టంలో పేర్కొనలేదు. సర్టిఫికెట్లు, పహానిల ప్రస్తావనే లేదు. అందుకే అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడతారని ఆందోళన నెలకొంది.
వాస్తవం: భూ హక్కు చట్టం సెక్షన్‌ 57 ప్రకారం ఈ చట్టం కింద చేసే ప్రతి పనిని పారదర్శకతకోసం, మానవ తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు లేకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో చేయాలని చెబుతుంది. అంటే ఒక పేరు చేర్చాలన్నా, తీయాలన్నా ఏది జరగాలన్నా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో, అందరూ చూసేలా ఉంచుతారు. ఈ చట్టంలో సెక్షన్‌ 57, 58, 59 లలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000 కింద ఎవరూ మార్పులు చేయడానికి వీల్లేకుండా అన్నిరకాల సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్న కంప్యూటర్‌ సిస్టం తయారు చేయాల్సిందిగా నిర్దేశించడం జరిగింది. ఈ చట్టం కింద జరిపే ప్రతి వ్యవహారాన్ని, ప్రతి నిమిషం ఎవరైనా, ఎక్కడైనా చూసుకునే అవకాశం ఉన్నందున అధికారులు, రాజకీయ నేతలు ప్రమేయానికి ఆస్కారమే లేదు. వివాదాలకు ఆస్కారం లేకుండా భూ యజమానికి కంక్లూజివ్‌ టైటిల్‌ ఇస్తారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇస్తుంది.

ఆరోపణ: ఆస్తులకు సంబంధించిన దస్తావేదులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటాయి. క్రయవిక్రయాల సమయంలో వాటిని అధికారంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారము ఈ దస్తావేజులకు విలువే ఉండదు. మీరే యజమాని అంటూ టీఆర్‌వోలో ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో చట్ట ప్రకారం లక్ష రూపాయలను స్టాంప్‌ డ్యూటీగా చెల్లించి అధికారంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా టీఆర్వో ఇచ్చే ధ్రువపత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభ్యంతరకరం.
వాస్తవం: ఇదీ పూర్తిగా అవాస్తవం. సెక్షన్‌ 12 ప్రకారం ప్రచురించిన టైటిల్‌ ఆఫ్‌ రిజిస్టర్‌లో వివరాలపై అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు పూర్తి వివరాలతో ఎల్‌టీఏవో వద్ద కానీ, సివిల్‌ కోర్టులో కానీ దావా వేయవచ్చు. ఎల్‌టీఏవో ఉత్తర్వుల ప్రకారం లేదా కోర్టు ఆదేశాలను అనుసరించి టైటిల్‌ ఆఫ్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేస్తారు. హక్కులు నిర్ధారణ అయి, టైటిల్‌ ఆఫ్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదయ్యే వరకు మన దగ్గర ఉన్న పత్రాలు పదిలంగా ఉంచుకోవచ్చు. ఇవి హక్కుల నిర్ధారణకు ఆధారాలుగా పరిగణిస్తారు. టైటిల్‌ ఆఫ్‌ రిజిస్టర్‌లో నమోదైన రెండేళ్ల తరవాత ఆ భూమిపై సంపూర్ణ హక్కు లభిస్తుంది. అనేక రికార్డుల స్థానే ఒకే ఒక్క హక్కు పత్రం వస్తుంది. ఇప్పటివరకూ యజమానులకు సంబంధించిన భూములపై 1బీ, పాసుపుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్‌ డీడ్‌ రూపంలో అనేక పత్రాలున్నాయి. వీటిస్థానే ఒకే శాశ్వత హక్కుపత్రం వస్తుంది. రికార్డులన్నీ అప్‌ డేట్‌గా ఉంటాయి. ఎవ్వరూ టాంపర్‌ చేయలేని రీతిలో పటిష్ట కంప్యూటర్‌ వ్యవస్థ ద్వారా నిక్షిప్తం అవుతాయి. ఇంతటి పారదర్శక, పటిష్ట ప్రక్రియపై ఈనాడు అవాస్తవాలు రాస్తోంది.

ఆరోపణ: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాలను టైటిల్‌ రిజిస్టర్లు నమోదు చేయించుకోవాల్సిందే. అధికారులను దారిలోకి తెచ్చుకొని ఎవరైనా ప్రభుత్వ, దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్‌ రిజిస్టర్‌లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. రిజిస్టర్లు అధికారులు అధీనంలో ఉంటాయి కాబట్టి బయటకు తెలిసే అవకాశం ఉండదు. పేరు మార్పును రెండేళ్ల వరకు ఎవరూ పట్టించుకోకుంటే ఆ తర్వాత భూములపై యాజమాన్య హక్కులు వారికే దఖలు పడతాయి. అదే జరిగితే అధికారం, ధనబలం, కండబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి దేవాదాయ, ప్రభుత్వ భూములు వెళ్ళిపోతాయి. ప్రైవేట్‌ వ్యక్తుల మాదిరిగా ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి ఆ భూముల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉండదు.
వాస్తవం: అవలక్షణాలను వ్యవస్థ నుంచి ఏరిపారేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంటే ఈనాడు దినపత్రిక అది వద్దన్నట్టు అవాస్తవాలు రాస్తోంది. భూ పరిపాలనా వ్యవస్థలో అధికార బలం, ధనబలం లాంటి అంశాలకు చోటు ఉండకూడదనే వివాదాల్లేని రీతిలో కంక్లూజివ్‌ టైటిల్స్‌ అందించే ప్రక్రియ ఈ చట్టం ద్వారా జరుగుతోంది. రిజిస్టర్‌ ఆఫ్‌ టైటిల్స్‌ అనేది భావితరాలకు భూహక్కులకు సంబంధించి ఒక ముఖ్యమైన రిజిస్టర్‌. దీని తయారీలో తీసుకునే జాగ్రత్తల వల్ల ఇది అత్యంత పకడ్బందీగా ఉంటుంది.

12 months ago

'మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర' అంటూ 26-01-2024న ఈనాడు దినపత్రికలో ప్ర‌చురిత‌మైన క‌థ‌నం పూర్తిగా అవాస్త‌వం. ఈ త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

- అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ గనుల ద్వారా ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్‌ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. దీనిలో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్, మిగిలిన 17 లక్షల టన్నులు సి, డి & డబ్ల్యు (వేస్ట్) గ్రేడ్ లు. ఇందులో సి, డి గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఈ ఖనిజం నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల వరకు C, D, W లకు చెందిన ఖనిజ నిల్వలు అమ్మకం కాకుండా ఉన్నాయి. వాటిని నిల్వ చేయడం, నిర్వహించడం కూడా భారంగా మారింది. వాటి విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు నిర్వహించినప్పటికీ సరైన స్పందన లభించలేదు. ఈ టెండర్ల ద్వారా వాటిని విక్రయిస్తే ఈ నిర్వహణా ఖర్చు తగ్గడంతో పాటు సంస్థకు ఆదాయం వస్తుంది.

- అంతర్జాతీయంగా సి, డి గ్రేడ్ బెరైటీస్‌కు మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో ఏపీఎండీసీ కోటి టన్నులకు తాజాగా ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల C, D, W గ్రేడ్ ఖనిజానికి ఏపీఎండీసీ టెండర్లు పిలుస్తుంది. అయితే కొనుగోలుదారుల నుంచి మాత్రం ఈ మేరకు స్పందన రావడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున అయిదేళ్ళకు గానూ ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలవడం జరిగింది. దీనిని అర్థం చేసుకోలేక ఒకేసారి కోటి టన్నులకు టెండర్లు అంటూ ఈనాడు పత్రిక అవగాహన లేని రాతలు రాసింది.

- సి, డి గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను కూడా తగ్గించారంటూ ఈనాడు దినపత్రిక మరో తప్పుడు ఆరోపణ చేసింది. జీఓ 262 నిబంధనలకు అనుగుణంగానే రిజర్వు ధరను నిర్ణయించడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోని ధరలకు అనుగుణంగానే ఈ రేటును నిర్ణయించడం జరిగింది. ఇందులో ఎవరికో మేలు చేయాలనే ఆలోచనే లేదు. ఆసక్తి ఉంటే ఇదే ధరకు ఈనాడు యాజమాన్యం కూడా టెండర్లలో పాల్గొని బిడ్ ను దక్కించుకోవచ్చు.

- టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర జీఎఫ్ఆర్‌ నిబంధనలకు లోబడే ధరావత్తును ఖరారు చేయడం జరిగింది. అలాగే 17 రోజుల్లోనే టెండర్లను పూర్తి చేస్తారనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందే తప్ప దీనిలో ఏపీఎండీసీ సొంతగా నిర్ణయించేది ఏమీ ఉండదు.

- టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో.. టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసీకి చెల్లింపులకు అయ్యే మొత్తం వ్యయంను దృష్టిలో పెట్టుకునే దానిని నిర్ణయించడం జరిగింది. ఇది సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే విధానం. దీనిని కూడా ఈనాడు పత్రిక వ‌క్రీక‌రించి రాసింది.

- న్యాయ సమీక్షకు ఎందుకు పెట్టలేదంటూ ఈనాడు పత్రిక చేస్తున్న వాదన అర్థ‌ర‌హితం. రూ.100 కోట్లకు పైగా వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్లకే న్యాయసమీక్షను కోరుతారు. ఇక్కడ బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఈనాడు ప‌త్రిక‌ అస‌త్య క‌థ‌నం రాసింది.

- నాణ్యమైన బెరైటీస్‌తో పాటు C, D, W గ్రేడ్ ఖనిజాన్ని కూడా ఎప్పటికప్పుడు విక్రయించేందుకు ఏపీఎండీసీ ప్ర‌య‌త్నం చేస్తోంది. కాబ‌ట్టి కేవలం ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డంలో భాగంగానే ఈనాడు పత్రిక ఈ అస‌త్య క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

12 months ago

'బ‌కాయిల రోగం.. సేవ‌లు ఘోరం..!' శీర్షిక‌న 26-01-2024న ఈనాడు దినపత్రిక ప్ర‌చురించిన క‌థ‌నం పూర్తిగా అవాస్త‌వం. రాష్ట్రంలోనే పేద‌లంద‌రికీ స‌క్ర‌మంగా ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందుతున్నా ఈనాడు ప‌నికట్టుకుని ఆరోగ్య‌శ్రీపై అస‌త్య క‌థ‌నాలు రాయ‌డాన్ని ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

- రాష్ట్రంలో ఏ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకోని ఘటనలు చోటుచేసుకోలేదు. ప్ర‌తిచోటా ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో 'ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు ఆపసోపాలు, ఆరోగ్యశ్రీ సర్వీసులు నిలిచిపోయాయి.. ఆసుపత్రులకు బెదిరింపులు..' అంటూ ఈనాడు పత్రిక అభూత కల్పనలు, అవాస్తవాలతో తప్పుడు కథనాలను ప్ర‌చురిస్తోంది.

- గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ టస్టు నుంచి రూ.2,146.90 కోట్లు నెట్‌వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఇప్పటి వరకు రూ.2,790.61 కోట్లు నెట్‌వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గడిచిన మూడు నెలల్లో రూ.1,042.83 కోట్లను నెట్‌వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. పరిశీలన తర్వాత పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.369 కోట్లు మాత్రమే.

- రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రతి కుటుంబానికి వార్షిక చికిత్స పరిమితిని రూ.25 లక్షల వరకు అందిస్తున్నాం. దురదృష్టం కొద్దీ, ప్రమాదవశాత్తూ అనారోగ్యంపాలైన వారిని ఆదుకునేందుకు, వారిపై పైసా భారం లేకుండా చూసేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలతో పూర్తిగా పటిష్టం చేసింది.

- గత ప్రభుత్వంలో 1000 చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితం అయితే ఈ ప్రభుత్వం చికిత్సల సంఖ్యను 3,257కి పెంచింది. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చింది. చికిత్సల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్‌లు రోజుకు 1,547 నుంచి 5,608కి పెరిగాయి. ఇంతకుముందుతో పోలిస్తే పని మూడు రెట్లు పెరిగింది. అందుకు తగిన విధంగా అవసరమైన డాక్టర్లను 30 నుంచి 60 మందికి పెంచడం జరిగింది. ఇంకా దీన్ని పూర్తిగా పటిష్టం చేయడానికి వారి సంఖ్య పెంచడానికి ఈ ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.

- క్లెయిమ్స్ మరింత త్వరితగతిన పారదర్శకంగా SLA టైమ్‌లైన్‌ల ప్రకారం ఆమోదించడానికి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన జీ.ఓ.ఎం.ఎస్. నెo: 18, తేదీ 24.01.2024 ద్వారా ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులందరినీ తప్పనిసరిగా డాక్టర్ YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వ స్పెషలిస్టు వైద్యులను ప్యానెల్ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ ప్రారంభించాం. క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన AIIMS, SVICCAR, HOMIBABA, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన DME, SVIMS, VIMS ద్వారా వైద్యులను క్యాన్సర్ వైద్యులుగా తీసుకోవడం జరిగింది.

డ‌బ్బులు వ‌సూలుకు ఆస్కార‌మే లేదు:
- ఆరోగ్య‌శ్రీ కింద చికిత్స పొందే స‌మ‌యం నుంచి ఇంటి వెళ్లిన త‌ర్వాతి వ‌ర‌కు ఎంతోమంది క్రాస్ వెరిఫికేష‌న్ ఉంటుంది. అలాంటి ప‌రిస్థితుల్లో ఏ ద‌శ‌లోనూ డబ్బులు వ‌సూలుకు ఆస్కార‌మే ఉండ‌దు. ఒకవేళ ఈ దశల్లో ఏదశలో అయినా డబ్బులు వసూలు జరిగింది నిజమని తేలితే ఆ ఆసుపత్రి యజమాన్యంపై చర్యలు ఉంటాయి. అంతటితో ఆగకుండా.. వసూలు చేసిన నగదు రోగి కుటుంబానికి ఇచ్చి, నివేదిక రూపంలో డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్టు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు తెలియచేసిన దాఖలాలు ఉన్నాయి.
- రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, సరిగ్గా సేవలు అందించకపోవడం తదితర నిబంధనలను పాటించని ఆసుపత్రులపై జరిమానాలు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి.
- ఇంత పకడ్బందీగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టును నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దిష్టమైన ప్రణాళికలతో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడు మాత్రం ప‌దే ప‌దే త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తూ, అసత్య ఆరోప‌ణ‌లు చేస్తోంది.

1 year ago

రాష్ట్రంలో ఇసుక ఆప‌రేష‌న్స్ పై 'ఇసుకలో కొత్త తోడు దొంగలు' అనే శీర్షికన 17.01.2024న ఈనాడు దిన‌ప‌త్రికలో ప్రచురించిన క‌థ‌నం పూర్తిగా అవాస్త‌వం. సీఎం గారి సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారంటూ ఈనాడు అసత్యాలు, అభూత కల్పనలతో కథనం రాసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

- ఉచిత ఇసుక విధానం పేరుతో గతంలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సీఎం వైయస్ జగన్ గారు అత్యంత పారదర్శక విధానం అమలులోకి తీసుకువచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక ఆపరేషన్స్ కు ఏజెన్సీలను ఖరారు చేసి, ఆపరేషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో.. ఈనాడు పత్రిక అభూత కల్పనలను, అవాస్తవాలను పోగుచేసి పదేపదే ఇసుకపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది.

- రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న MSTC ద్వారా టెండర్లు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్యాకేజీ -1, ప్యాకేజీ-3 లోని 18 జిల్లాలకు, జిసికెసి ప్రాజెక్ట్ & వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజీ-2 లోని 8 జిల్లాల్లో ఇసుక ఆపరేషన్స్ కు సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికయ్యాయి.

- ఈ టెండర్లలో సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికయిన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్ లలో డీసిల్టింగ్ జరుగుతోంది.

- ఇసుక ఆపరేషన్స్ అనేది గనులశాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్ లకు లీజు అనుమతులు మంజూరు గనులశాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంఓ నుంచి కాదు. సీఎం గారి సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ... అదేమని ప్రశ్నించిన వారికి తమకు సీఎంఓ నుంచి అనుమతులు ఉన్నాయంటూ చెబుతున్నారంటూ ఈనాడు పత్రిక పూర్తిగా నిరాధారమైన కథనం రాసింది. రాష్ట్రంలో టెండర్ల ద్వారా ఇసుక ఆపరేషన్లకు ఎంపికైన సంస్థలు ఒకవైపు పని చేస్తుంటే, మరోవైపు బయటి వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ ఈనాడు తన కథనంలో ఆరోపించడం పూర్తిగా అవాస్తవం. సీఎం గారి సోదరుడికి, మరో వ్యక్తికి ఇసుక ఆపరేషన్లతో ఎటువంటి సంబంధమూ లేదు. నిరాధారమైన ఆరోపణలతో ఈనాడు దినపత్రిక పదేపదే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది.

- ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఎస్ఇబిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్వ్కాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు నిర్వహిస్తున్నాం. ఈ విభాగాల పనితీరును కూడా ఈనాడు ఆక్షేపించడం దారుణం. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ ఈనాడు నిరాధార ఆరోపణలు చేస్తోంది.

- ఇంత పకడ్బందీగా ఇసుకపై పర్యవేక్షణ జరుగుతుంటే, ఈనాడు పత్రిక మాత్రం నిత్యం ఏదో ఒక రకంగా ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయాలనే లక్ష్యంతో ఇసుకపై పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తాకథనాలు రాస్తున్న ఈనాడుపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.

1 year, 1 month ago

పరిహారం రూ.7 లక్షలకు పెంచిన సీఎం జగన్‌:
– దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటోంది.
– గత ప్రభుత్వంలో.. ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. అందులో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన రూ.3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో, పదేళ్లకో ఆ డబ్బును విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉండేది.
– సీఎం వైయస్‌ జగన్‌ ఈ దుస్థితికి చరమగీతం పాడారు. మొదట ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తున్నారు.
– వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలుదారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందిస్తోంది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 1270 కేసులకు సంబంధించి రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించింది. ఇందులో 485 మంది కౌలు రైతులుండగా,ఆ కుటుంబాలకు రూ.33.95 కోట్ల ఆర్థిక సాయం అందించింది.
– 2014–19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్ల పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలు రైతులున్నారు. వీరికి రూ.10.60 కోట్ల పరిహారం చెల్లించి ఈ ప్రభుత్వం తన మానవీయతను చాటుకొంది.

తెలుగుదేశం హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దమనకాండ:
– గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై యథేచ్ఛగా సాగిన దమనకాండ ఎప్పటికీ ఆ వర్గాలకు పీడకలే. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో... దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యధికంగా జరిగిన టాప్‌–10 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది.
– రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం వచ్చిన తరవాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు గణనీయంగా తగ్గాయి.
– గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బాధిత ఎస్సీ, ఎస్టీలు పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయేవారు. ధైర్యంచేసి బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకువస్తే బెదిరించి వెనక్కి పంపించేవారు.
– ఇక కన్విక్షన్‌ రేటును పరిశీలిస్తే... గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో శిక్షలు పడిన కేసులు చాలా తక్కువ. 2014లో 5.4 శాతం ఉంటే, 2016లో కేవలం 3.2 శాతమే. 5 ఏళ్ల సగటు 6 శాతంలోపే.

ఎస్సీ, ఎస్టీలకు ధైర్యాన్నిచ్చిన సీఎం వైయస్‌ జగన్‌:
– అందుకు భిన్నంగా వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు ధైర్యంగా ఫిర్యాదు చేసే పరిస్థితులు కల్పించింది.
– ‘‘కేసుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా.. ఫర్వాలేదు, బాధితులకు న్యాయం జరగాలి...దోషులకు శిక్షలు పడాలి’’ అనే విధానాన్ని అమలు చేస్తోంది.
– ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపట్ల వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
– దీంతో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన సగటు నేరాల సంఖ్య కూడా ఈ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
– 2014 –2018 వార్షిక సగటు కేసుల సంఖ్య 3,418. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 2019 నుండి 2022 వరకు వార్షిక సగటు 2,312కి తగ్గింది.
– ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తిచేయడానికి 2014–19 మధ్య సగటున 206 రోజులు పడితే.. వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ సరాసరి భారీగా 86 రోజులకు తగ్గిపోయింది.
– టీడీపీ హయాంలో కేవలం 44 శాతం కేసుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేస్తే... ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఛార్జిషీట్ల నమోదు 73 శాతానికి పెరిగింది.
– ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడిన వారికి సత్వరం శిక్షలు విధించేలా చేయడంలో సీఎం వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది.
– 2022లో ఎస్సీ, ఎస్టీలపై నేరాల కేసుల్లో 63.7 శాతం కేసుల్లో దోషులకు శిక్షలు విధించడమే అందుకు నిదర్శనం. ఆ అంశంలో మన రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది.

బాధితులకు బాసటగా నిలిచిన సీఎం జగన్‌:
– దాడులు, వేధింపుల కేసుల్లో బాధితులైన ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడంలో కూడా గొప్ప చొరవ చూపించారు సీఎం వైయస్‌ జగన్‌. గత ప్రభుత్వ హయాంలో దాడులు, వేధింపులకు గురైనవారికి... వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పరిహారాన్ని పంపిణీ చేసింది.
– చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో కేవలం రూ.54.60 కోట్లే బాధితులకు పరిహారంగా ఇచ్చింది.
– కానీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.159.30 కోట్లు పరిహారంగా అందించి బాధితులను ఆదుకుంది.

వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం ఇన్ని రకాలుగా మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ ఈనాడు దినపత్రిక మాత్రం తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది.

1 year, 1 month ago

దళితులు, గిరిజనులపై ఈనాడు దినపత్రిక మరోసారి మొసలి కన్నీరు కార్చింది. దేశ చరిత్రలోనే విప్లవాత్మక రీతిలో దళిత, గిరిజనుల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికను తనకు నచ్చిన రీతిలో ఉపయోగించుకుని, వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వాస్తవాలను కింద పొందుపరుస్తున్నాం.

నేరాలు, రైతుల ఆత్మహత్యలు తగ్గాయి:
– రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం జగన్‌ గారి ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయి. హత్యలు, హింసాత్మక సంఘటనలు, అవినీతి కేసులు బాగా తగ్గుముఖం పట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
– ఈ విషయాన్ని స్వయంగా ఎన్‌సీఆర్‌బీ నివేదికే వెల్లడించింది. 2022లో దేశంలో వివిధ నేరాల గణాంకాలతో ఎన్‌సీఆర్‌బీ తాజాగా నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల నేరాలు తగ్గడంతోపాటు, రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
– నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్‌ కాగ్నిజబుల్‌ కేసులు కూడా తగ్గడం శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం.

తగ్గుముఖం పట్టిన ఐపీసీ కేసులు:
– 2020లో ఐపీసీ కేసులు 1,88,997 నమోదుకాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి.
– ఇక స్పెషల్‌ లోకల్‌ లా కేసులను చూస్తే 2020, 2021, 2022 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి.
– మొత్తం కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 2020లో 2,38,105 కేసులు ఉంటే, 2021లో 2,22199 కాగా, 2023లో 1,95,284 నమోదయ్యాయి.

సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీసు శాఖ:
– నేరాలకు పాల్పడేవారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. వేగంగా చార్జిషీట్లు దాఖలు చేస్తూ దర్యాప్తును పోలీసు శాఖ వేగవంతం చేస్తోంది. 2022లో ఐపీసీ కేసుల్లో 86.5శాతం కేసుల్లో, లోకల్‌ లా కేసుల్లో 96.4 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధి 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం మీద 88.9 శాతం కేసుల్లో నిర్ణీత వ్యవధిలో చార్జిషీట్లు దాఖలు చేసింది.

గణనీయంగా తగ్గిన హత్యలు:
– రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా.. 2022లో వీటి సంఖ్య 925కు తగ్గింది. హత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల్లో 3 శాతానికిపైగా ఉండగా... తెలంగాణలో హత్యల రేటు 2.5శాతం ఉంది. ఏపీలో మాత్రం 1.7 శాతానికే పరిమితమైంది. హత్య కేసుల్లో దేశంలో టాప్‌–20 రాష్ట్రాల జాబితాలో కూడా ఏపీ లేదు.
– ఘర్షణలు, అల్లర్ల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 444 ఘర్షణలు, అల్లర్ల కేసులు నమోదు కాగా 2022లో ఆ కేసులు 304కు తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెప్తున్నాయి.

సత్ఫలితాలనిస్తున్న ‘దిశ’:
– దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
– రాష్ట్రంలో మహిళలపై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
– 2021లో రాష్ట్రంలో 1,188 అత్యాచారాల కేసులు నమోదు కాగా 2022లో ఆ సంఖ్య 621కి తగ్గింది. అత్యాచారాల కేసులు దేశంలోనే అత్యధికంగా 47.72 శాతం తగ్గడం.. ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.
– ఇక 2021లో రాష్ట్రంలో 111 వరకట్న కేసులు నమోదు కాగా 2022లో ఆ కేసులు 100కు తగ్గాయి. వరకట్న కేసుల రేటు కేవలం 0.4 శాతానికే పరిమితమైంది.
– యాసిడ్‌ దాడుల కేసులు 2021లో ఏడు నమోదుకాగా 2022లో 4కు తగ్గాయి.

గణనీయంగా తగ్గిన రైతుల ఆత్మహత్యలు:
– రైతు సాధికారత కోసం సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సాగు లాభసాటిగా మారడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.
– 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా కౌలు రైతులు 122 మంది.
– 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369కు తగ్గాయి. వారిలో భూయజమానులైన రైతులు 309మంది కాగా, కౌలు రైతులు 60 మంది.
– 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా... 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా...2022లో అవి 917కు తగ్గాయి.

1 year, 1 month ago

- రాష్ట్రంలో గుండె జ‌బ్బుల విష‌యంలో ఏ ఆస్ప‌త్రి అయినా నిర్దిష్ట‌మైన ప్రోటోకాల్ ప్ర‌కార‌మే చికిత్స‌ను అంద‌జేస్తుంది. ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీ కింద త‌క్కువ మొత్తం చెల్లిస్తోంద‌ని, ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌నే ఉద్దేశంతో ఒక‌రికి వాడిన ప‌రిక‌రాల‌నే ఎక్కువ మందికి వినియోగిస్తున్నారంటూ ఈనాడు చేసిన ఆరోప‌ణ‌లు చాలా దారుణం. దీనివ‌ల్ల మ‌ర‌ణాలు కూడా జ‌రుగుతున్నాయంటూ ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తించేలా అస‌త్య‌పు ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌చురించ‌డం ఆందోళ‌న‌క‌రం.
- ఆరోగ్య‌శ్రీ కింద గుండె ఆప‌రేష‌న్లు చేయించుకునే వారిలో ఇటువంటి నిరాధార‌మైన త‌ప్పుడు రాత‌లు ఆందోళ‌న‌ క‌లిగిస్తాయి. ఎక్క‌డైనా ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందితే స‌ద‌రు ఆసుప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయి.

ఆరోగ్య‌శ్రీ కింద భారీ వ్యయం:
- పొరుగు రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, తెలంగాణ‌ల‌తో పోలిస్తే గుండె జ‌బ్బుల‌కు నిర్వ‌హించే శ‌స్త్ర చికిత్స‌లకు.. వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద చేస్తున్న చెల్లింపులు ఎక్కువ‌.
- రాష్ట్రంలో వెయ్యి రూపాయ‌ల క‌న్నా ఎక్కువ వైద్యం ఖ‌ర్చు ఉంటే, దానికి కూడా ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీ కింద చెల్లింపులు చేస్తోంది. అంటే కొద్దిపాటి వైద్యానికి కూడా ఖ‌ర్చు చేయ‌లేని పేద‌ల‌కు ప్ర‌భుత్వం ఎంతో బాధ్య‌త‌తో బాస‌ట‌గా నిలుస్తోంది.
- 2014-19తో పోలిస్తే ఆరోగ్య‌శ్రీ కోసం వైయస్ జగన్ గారి ప్ర‌భుత్వం రెట్టింపు బ‌డ్జెట్ కేటాయించింది. గ‌త అయిదేళ్ల‌లో ఆరోగ్య‌శ్రీ కింద కేటాయించిన బ‌డ్జెట్ రూ.5171.29 కోట్లు అయితే 2019-23 వ‌ర‌కు కేటాయించిన బ‌డ్జెట్ రూ.11,859 కోట్లు.
ఈ వాస్తవాలను దాచి ఈనాడు దినపత్రిక నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనం రాసి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి, భయాందోళనలకు గురి చేయడానికి ప్రయత్నించడం దారుణం.

1 year, 3 months ago

– రుషికొండ భవనాల్లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం, అన్యాయం అన్నట్టుగా ఈనాడు దినపత్రిక తప్పుడు వార్తలు రాస్తోంది. పైగా విశాఖపట్నం పక్కదేశంలోనో, శత్రుదేశంలోనో ఉన్నట్టు తప్పుడు చిత్రీకరణ చేస్తోంది. రిషికొండలో ఉన్న భవనాలన్నీ ప్రభుత్వ భవనాలే. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి రాజ్యాంగబద్ధంగా ఆయనకు అన్ని అధికారాలూ ఉన్నాయి. ఈనాడు దినపత్రిక మాత్రం ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా తప్పుడు కథనాలు రాస్తోంది.

– మరోవైపు ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఈనాడు దినపత్రిక పలుమార్లు నిరాధార ఆరోపణలతో తప్పుడు వార్తలు రాసింది. ఇదే ఈనాడు దినపత్రిక... బాలకృష్ణ వియ్యంకుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి భూ కబ్జాల గురించి ఏ రోజూ కథనాలు రాయలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న.. నగరంలోనే విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంవీవీఎస్‌ మూర్తి స్వాహా చేశారు. వందలకోట్ల విలువైన ఈ భూమి కబ్జాలో ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపలేదు. ఈనాడు దినపత్రిక కూడా ఎప్పుడూ వార్తలు రాయలేదు.

– ఈ ప్రభుత్వం వచ్చాక కబ్జాలపై గట్టి చర్యలకు దిగింది. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే వల్ల మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. కోర్టు ప్రక్రియను త్వరగా ముగించి, తొందరలోనే ఈ భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

– ఈ కబ్జా జరిగింది ఎక్కడో కాదు. ఈనాడు దినపత్రిక రోజూ రుషికొండ చుట్టూ తప్పుడు కథనాలు రాస్తున్న ప్రాంతానికి సరిగ్గా ఎదురుగానే. తెలుగుదేశం నాయకుల భూకబ్జాలను ఈనాడు ప్రశ్నించకపోగా.. ప్రభుత్వం ఆ ఆక్రమణలు తొలగిస్తే దాన్ని అభివృద్ధి విధ్వంసంగా ప్రభుత్వంపై తప్పుడు ముద్రవేసే ప్రయత్నం చేసింది ఈనాడు దినపత్రిక.

- రుషికొండలో భూముల కబ్జాకు సంబంధించిన చిత్రం కూడా చూడొచ్చు.
అ) గులాబీ రంగులో ఉన్న 19.39 ఎకరాల కబ్జా భూమిని మొదటి విడతగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఆ) ఆకుపచ్చ రంగులో 4.74 ఎకరాల కబ్జా భూమిని రెండో విడతగా స్వాధీనం చేసుకుంది.
ఇ) ఎరుపు రంగు గళ్లతో ఉన్న భూమి ఇంకా కబ్జాలో ఉంది. కబ్జా చేసిన ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను చాలా స్పష్టంగా చూడొచ్చు.

– ఇక రుషికొండ వద్ద హెలిప్యాడ్‌... ఇదేదో ఇప్పుడే ప్రత్యేకంగా నిర్మించినట్టు, ఇదంతా ముఖ్యమంత్రి విలాసాల్లో భాగమంటూ ఈనాడు తప్పుడు రాతలు రాసింది. వాస్తవం ఏంటంటే.. 2019కు ముందే అక్కడ హెలిప్యాడ్‌ ఉంది. హెలికాప్టర్‌ రాకపోకలు కూడా జరిగాయి. కానీ ఈ నిజాలను దాచేసి ఇప్పడే ఈ సదుపాయాలన్నీ వచ్చినట్టుగా ఈనాడు అబద్ధాలు రాసింది.
2019కు ముందే రుషికొండ వద్దనున్న హెలిప్యాడ్‌లో దిగిన హెలికాప్టర్, 2019కు ముందు రుషికొండ చుట్టూ ఉన్న రోడ్డులను కూడా ఫొటోల్లో చూడొచ్చు.

– అలాగే రుషికొండ చుట్టూ కూడా ఇప్పుడే ముఖ్యమంత్రిగారి కోసం రోడ్డు వేసినట్టుగా కూడా ఈనాడు వక్రీకరణ చేసింది. 2019కు ముందుకూడా రుషికొండ చుట్టూ ఉన్న గ్రావెల్‌ రోడ్డును స్పష్టంగా చిత్రంలో చూడొచ్చు. కానీ, ఇప్పుడే కొత్తగా రోడ్డు వేస్తున్నట్టు ఈనాడు తప్పుడు రాతలు రాసింది. తాజాగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్డు మార్గాన్ని తీర్చిదిద్దారు.

– వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆస్తులకు రాచబాట అంటూ ఈనాడు ఇవాళే మరో కథనాన్ని ప్రచురింది. వాస్తవం ఏంటంటే.. ఆ రోడ్లన్నీ ప్రజలు వినియోగించుకునే రోడ్లు. అన్ని పార్టీలవారూ, అన్ని కులాలవారూ, అన్ని మతాల వారూ ఆ రోడ్లకు అటూ ఇటూ నివాసం ఉంటున్నారు. ప్రజలకోసం రోడ్లు వేస్తే.. ఈనాడు మాత్రం తప్పుడు కథనాలు రాస్తోంది. ఏ నగరానికైనా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పబ్లిక్‌ రోడ్లు ఉంటాయనే విషయాన్ని ముందుగా గుర్తిస్తారు. నివాసాలు ఏర్పడుతున్నకొద్దీ కరెంటు, రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఏ ప్రభుత్వమైనా చేసే పని ఇది. ఈనాడుకు మాత్రం తప్పుగా కనిపిస్తోంది.

– కేవలం విశాఖపట్నం మీదున్న విద్వేషంతో.. ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వం పట్ల ఏదో రకంగా వ్యతిరేకత తీసుకురావాలని ఈనాడు పత్రిక ప్రయత్నిస్తోంది.

#Vizag #FactCheck

We recommend to visit

వేమన శతకంలోని వంద పద్యాలను..
అద్భుతమైన వివరణతో విని ఆనందించండి.
నేటి బాలలకే కాదు పెద్దలకూ ఉపయోగకరం!
-Naren

Last updated hace 2 años, 5 meses